Home  »  TV News  »  అడుగడుగునా ధరణిని అవమానిస్తున్న శైలేంద్ర!

Updated : Apr 29, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -749 లో..శైలేంద్ర దగ్గరికి వెళ్లి భోజనానికి రండని పిలుస్తుంది ధరణి. నువ్వు వసుధారా క్లోజ్ గా ఉంటారా? గిఫ్ట్ తీసుకొచ్చాడా అని అడగమంటుంది ఏంటి? అయిన నేను వస్తానాని నాకోసం ఎదురుచూడని దానివి నువ్వు.. నీకు గిఫ్ట్ ఎందుకు తీసుకువస్తాను.. అయినా నీకు ఏం తీసుకొస్తాను.. నువ్వు ఒక అప్పలమ్మవి.. ఎప్పుడు ఇదే వాలకంలో ఉంటావ్? నిన్ను పూర్తిగా చూడాలని కూడా నాకనిపించదని శైలేంద్ర అనగానే..  ధరణి బాధపడుతూ వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత అందరూ భోజనం చేస్తుండగా.. నీకోసం ధరణి ఎన్ని వంటలు చేసిందో చూడని శైలేంద్రతో మహేంద్ర అంటాడు. ఈ బెండకాయ నాకు ఇష్టముండదని శైలేంద్ర అంటాడు. నీకోసం ఎంతో ఇష్టంగా చేసిందని మహేంద్ర అనగానే.. బలవంతంగా మీకోసం వేసుకుంటానని‌ శైలేంద్ర చెప్పి.. ఆ కర్రీ వేసుకొని దానిని పక్కన పెట్టి మిగతాది తింటాడు. అదంతా గమనిస్తూ ధరణి బాధపడుతుంది. శైలేంద్ర హ్యాండ్ వాష్ చేసుకొని.. నీ ఇష్టాలను నా మీద రుద్దాలని చూడకంటూ.. తనపై కర్చీఫ్ ని వేసి వెళ్తాడు. వాళ్లిద్దరినే  అబ్ సర్వ్ చేస్తూ ఉంటుంది వసుధార. ఆ తర్వాత ధరణి దగ్గరికి జగతి వచ్చి.. వంటలు బాగున్నాయని మెచ్చుకున్నాడా అని అడుగుతుంది. అయిష్టంగానే 'హ అవును' అని ధరణి అంటుంది. అప్పడే జగతి దగ్గరికి వసుధార వచ్చి.. ధరణితో శైలేంద్ర ఏమో అంటున్నాడని అనగానే.. అప్పుడే దేవయాని వస్తుంది. నిన్ను నా ఇంట్లో ఉండనివ్వడమే ఎక్కువ.. అనవసరంగా నా కొడుకు కోడలు విషయంలో కలుగజేసుకోకు.. అయినా నా కొడుకుని దారిలో తిట్టావట అంటూ వసుధారని కోప్పడుతుంది దేవయాని. మీ కొడుకు కదా మేడం.. మీ బుద్దులే వస్తాయంటూ వసుధార అంటుంది. నువ్వు ఎక్కువగా మాట్లాడుతూన్నావని దేవయాని అంటుంది. ఇంతలోనే వసుధర అంటూ రిషి పిలుస్తాడు. మన మధ్య జరిగింది రిషిమి చెప్తావా అని దేవయాని అనగా.. చెప్పేదాన్నయితే ఎప్పుడో చెప్పేదాన్ని.. రిషి సర్ తనంతట తానే తెలుసుకోవాలని చెప్పేసి వసుధార అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వసుధార కోసం రిషి చూస్తుంటే.. శైలేంద్ర వచ్చి రిషీతో కూర్చొని మాట్లాడుతాడు. నీ ప్రేమ గురించి చెప్పమని శైలేంద్ర అనగానే.. ప్రేమ గురించి గొప్పగా చెప్తాడు రిషి. ఇక కాసేపటికి వసుధారతో మాట్లాడాలని రిషి పైకి వెళ్తాడు.

రిషి, వసుధారలు మాట్లాడుకుంటారు. శైలేంద్ర గురించి వసుధార ఏదో చెప్తుండగా.. శైలేంద్ర గురించి మంచిగా చెప్తుంటాడు రిషి. మా పెద్దమ్మ నన్ను మా అన్నయ్యని ఒకేలా పెంచింది.. అన్నయ్య మంచివాడంటూ వసుధారకి చెప్తాడు రిషి. ఆ తర్వాత ధరణి దగ్గరికి దేవయాని వచ్చి.. నీ భర్త గురించి పట్టించుకోవడం లేదా? కాఫీ తీసుకొని రా.. నేను ఇస్తానని దేవయాని అంటుంది. ఇక ఇదంతా గమనించిన జగతి.. ఏం మనిషో ఏమో అని దేవయానిని ఉద్దేశించి అంటుంది. వెంటనే తన మనసులో ఉన్న దుఃఖాన్ని ఆపుకోలేక జగతి మీద పడి ఏడుస్తుంది ధరణి. ఎమోషనల్ గా ఉంటుంది జగతి ఓదార్చే సీన్.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.